తన చెలి గురించి ఒక ప్రియుడు అల్లిన కపిత:
నువ్వు లేని నా మది, నువ్వు లేని నా మది
శవం లేని సమాధి.ఆ ప్రియుడికి ఒకరిచ్చిన గౌరవం:
ఏరా, తాగొచ్చావా?
ఆ అబ్బాయి, అమ్మాయితో వాదిస్తున్నాడు–ఆ అమ్మాయి అబ్బాయిని “ఛోటు భాయ్” అంటోందని.
ఆ అమ్మాయి ఇచ్చిన వివరణ:ఒరే, నిన్ను అన్నయ్య అనడానికి లేదా తమ్ముడు అనడానికి అలోచిస్తే జీవితం మీద విరక్తి వస్తోంది. పోని, నువ్వు మరోలా నచ్చుతావా అంటే, నీ మొహానికి అంత లేదు. అందుకే అలా ఫిక్స్ అయ్యా.
ఆ అబ్బాయి విన్న వివరణ:
హమ్మయ్య! అన్నయ్యనీ కాదు, తమ్ముడిని కాదు, అయితే ఇంకొంచెం కష్టపడితే తెగ్గొట్టచ్చు.
నేను ఒకప్పుడు తెగ ఆనందపడిపోయాను. జనాలు నేను రాసే జోకులకి నవ్వుతున్నారని, కానీ ఈ మధ్యే తెలిసింది, నేను రాస్తున్నందుకు నవ్వుతున్నారని. పోనిలెండి! రాసి ఒక నిమిషం నవ్వించగలిగానా?