ప: శ్రీ వినాయకుని చరితను వినుమా
సకల పాపములను బాపుకొనుమా ||
చ: నలుగుతోను బొమ్మ చేసి, ప్రాణమ్ముపోసే
దివ్యమైన రూపు చూసి గౌరమ్మ మురిసే
ముద్దుతీర మోదకాలు తినిపించే
కావలిని కాయమని అజ్ఞ్యాపించే ||
చ: పరమశివుని రాకకై పార్వతి తపియించే
అతనికై మనసారా శివపంచాక్షరి జపియించే
గజాసుర గర్భము వీడి భవుడు హిమగిరికేతెంచే
అద్దగించిన బాలుని శిరముని ఖండించే ||
చ: అమ్మ అన్న ఆర్తనాదము కలిగించగ జపభంగము
పరుగున వచ్చి చూచెను బాలుని మృతదేహము
కరుణతొ కాంచెడు తల్లికి కలిగెను ఆగ్రహము
కండ్ల నిప్పులు రాలుచుండ ఇవ్వబోయె శాపము ||
చ: శపియించబోవగ శార్వాణి, కలిగించ ఆమెకుపశమనము
తెచ్చిరి ఆ త్రిమూర్తులు ఆ గజాసురుని శిరము
బాలుని దేహముకతికీ పోసిరీ పునః ప్రాణము
ఆ గజానునుని ధ్యానము జేసిన కలుగును, జనులకు శుభము ||