ప: ఉయ్యాలలూగవయ్యా
మా మది ఉయ్యాలలూగనీయకయ్యా ||
చ: లాలీ లాలీ లాలీ అంటూ పాడేను నీకు జోల
ప్రేమతొ లాలన చేసెటి తల్లినంటూ చూపించు స్వామి నీ లీల
నీలల నింగిలో విహరించు స్వామికి జగమంత కాదా ఊయల
కంటి రెప్పవలె కాచేటి తండ్రినంటూ వేంచేయి స్వామీ నీవిలా ||
చ: విద్యలకు రాజై వెలసిల్లు స్వామికి విద్యార్ధి హృదయమే ఊయల
సకల విద్యాభివృధ్ధి, సత్ బుధ్ధినిచ్చేటి,
సద్గురువు నేనంటూ పండించ రావయ్యా మా కల ||
చ: తొలి పూజలందేటి దైవమ్ముకు భక్తితో ఆనందభాష్పాల ఊయల
కునుకైనా రానీక, క్షణమైనా యెడబాయక
దైవమ్ము నేనంటూ దీవించ రావయ్య దీనుల ||
song Audio link 👇