ప: ఊయలలూగ వచ్చాడు గణపతి దేవుడు
జోలపాడగ ఉవ్విళ్ళూరాడు ఈ జీవుడు ||
చ: పదునాలు భువనాలు పాలించు స్వామి
వచ్చెను ఇలకు, కారణం ఏమి
కన్నుల విందుగ, మనసుకు ఇంపుగ
భజనలుజేసే భక్తజనులకు గని ||
చ: కొండంత దైవమై వెలసిన స్వామి
చిన్ని ఈ తొట్టెలో పవళించుటేమి
భక్తుల ప్రేమకు తాను దాసుడనుంచు
బిడ్డగా మారె నా పరమాత్ముడు
పసిబిడ్డగా మారె నా పరమాత్ముడు ||
song audio link 👇