ప: ఎగిరింది జాతీయ జెండా
ఆ నింగి అంచులదాకా
దశదిశలా మన కీర్తిని చాటి చెప్పగా
దశదిశలా మన సంస్కృతి చాటి చెప్పగా ||
చ: వ్యాపారమంటు వచ్చిరి మన దేశానికి తెల్లదొరలు
అయినారు వారికి మనవారు బానిసలు
హింసే ఆయుధమని నమ్మిరి ఆ క్రూరులు
అహింసనే ఆయుధమును చేపట్టిరి మన వీరులు
ఫలితమై వచ్చింది స్వాతంత్ర్యం
చేసుకుందము రండా మహోత్సవం ||
స్వేచ్చావాయువులే ఎటుచూసినా వీచుచుండగా ||
చ: ప్రగతికి మూలం విద్యార్ధి జీవితం
అందుకు కావాలి ఉన్నత విద్యాలయం
ఉన్నారు మంచి అధ్యాపక బృందం
బోధించగా మనకు విజ్ఞానం
మనమే దేశానికి మూలస్తంభాలం
భరతజాతి గౌరవం నిలబెడదాం
అని పాడుతుంటే, మురిసిపోతూ..ఎగిరింది ||