ప: కోవెలలో నేడొక వేడుక
చూడరారండి జాగును సేయక ||
చ: తలచినంతనే ఊంజల్ సేవ
ఒడలంతా పులకింతలు రావా
పిలిచినంతనే పలికేను బ్రోవ
మరి ఆ స్వామి సేవకు మరువక రావా ||
చ: చేసినంతనే గణపతి పూజ
సర్వ కార్యములు నెరవేరును కాదా
చెంత చేరండి ఆ స్వామి చరణాల మ్రోల
జీవితమే తరియించేను కాదా ||
చ: ఏ నోము నోచెనో శ్రీ గౌరి
ఊపగ తనను ఈ డొళీ
ఎన్ని జన్మల పుణ్యఫలమో మరి
కొలుచుటకా దేవదేవునిజేరి ||
song audio link 👇