ప: చల్లని తల్లివి నీవమ్మా
నను కరుణజూడగ రావమ్మా
నిన్నే నెర నమ్మితినమ్మా
నీ చరణములే కొలిచితినమ్మా ||
చ: అంబవు నీవే, జగదంబవు నీవే
మమ్మేలు మా తల్లి మహాలక్ష్మి నీవే
దీనుల కరుణించు దైవము నీవే
మమ్మేల కావగ వేగమె రావేమే ||
చ: లక్ష్మివై డొలాసురు వధియించలేదా
కాళివై మహిషుని మధియించలేదా
లలితవై లోకాలను గాచుటలేదా
తల్లివై దీనుల కాపాడలేవా ||