చేయిపట్టి ఓనమాలు దిద్దించేది గురువు

ప: చేయిపట్టి ఓనమాలు దిద్దించేది గురువు

ఓర్పుతో నేర్పుతో మంచి నడవడి నేర్పేది గురువు ||

చ: విద్యాలయం ఒక దేవాలయం

అందున్న గురువే ప్రత్యక్ష దైవం

మనం కోరితే మాత్రమే వరములనిచ్చేను దైవం

కోరకున్నా మంచిచెడులను తెలిపి జ్ఞానమొసగేను గురుదైవం ||

చ: తల్లిని గురువని తలచిన శివాజి చరిత్రలో నిలిచాడు

గురువనె మదిలో నిరతము నిలిపి విద్యనేర్చెను ఏకలవ్యుడు

వారు కావాలి మనకు ఆదర్శం

అపుడు నెరవేరేను గురువుల ఆశయం ||

చ: హిందూమత ఔన్నత్యం పాశ్చాత్యులకు బోధించిన కర్మవీరుడా నరేంద్రుడు

ఆ నరేంద్రునికి సహితం గురు రామకృష్ణుదే ఆదర్శం ||

చ: గురు ఔన్నత్యం గుర్తించి, పూజ్య భావముతొ మదినుంచి

ఎందున్నా ఏనాడైనా, మరువకుందము ఎంతవారలమైనా ||

Leave a comment