ప: దివ్య మంగళ హారతులీరే పడతులారా
విఘ్నముల బాపు విఘ్నేశ్వరునికి మనసారా ||
చ: ముక్కంటినే ఎదిరించి పోరాడిన ఆ ధీరునికి
తల్లికొరకు తొలినాడే తలయిచ్చిన ఆ త్యాగధనునికి ||
చ: గజముఖుడై, ప్రమధగణములకధిపతియై
ప్రధమ పూజ్యుడై, దీనజన పోషకుడై
భువిపై వెలసిన గణనాధునికి, ముదముగ లక్ష్మీగణపతికీ ||