ప: రాగమయి అమృతవల్లి కదలిరావా
కరుణామయి కల్పవల్లి కావగలేవా ||
చ: ఈ దీనురాలిపై దయగల్గలేదా
నీ కరుణ మాపై చూపగరాదా
మా మొర నీకు వినపడలేదా
వింటే మము నీవు కరుణించ రావా ||
చ: పువ్వునైన నీ పదముల వ్రాలేను
పండునైన నీకు అర్పితమయ్యేను
దివ్వెనైన నీ ముంగిట వెలిగేను
మనిషినై నీకు దూరమయ్యాను ||