ప: శ్రీ గణేశ పాహిమాం
జై గణేస రక్షమాం ||
చ: కనులకు విందైన దివ్యమైన ద్విరూపం
తెలిపేను మానవాళి మదిలోని లోపం
కొలిచిన భక్తులకు కొంగు బంగారం
కరుణకు నిలయమైన నీ చల్లని హృదయం
ఆ లోపాల మన్నించి దీవించు నవనీతం
ఆ లోపాల మన్నించి పాలించు ఆసనం
మా కోర్కెలన్నీ తీర్చేటి కల్పవృక్షం ||
చ: కలనైనా ఇలనైనా కావాలి నీ శరణం
రేయీ పగలూ చేసేమూ నీ ధ్యానమే
కొలిచేమూ అనయమూ నీ చరణమూ
ఇవ్వాలీ పూజమెచ్చి నీ అభయమూ ||
song audio link below 👇