అనగనగా ఓ చిన్నారి

అనగనగా ఓ చిన్నారి

ఉన్నాయామె మదిలో ఎన్నో భావాలు ఉవ్విళ్ళూరి

పంచప్రాణాలు ఆమెకు సంగీతం, సాహిత్యం

నాట్యమే ఆమెకు ఆరో ప్రాణం

గానకోకిల సుశీలవంటి గాయని కావాలన్న ఆరాటం

పద్మా సుబ్రహ్మణ్యంవంటి నాట్యరాణి కావాలన్న కుతూహలం

ఫలితం కోసం ప్రభుత్వ కళాశాలకు పయనం

కూలిందక్కడ ఆమె ఆశాసౌధం

పరిపక్వత లేదెందుకు విద్యలో అంటూ తల్లితండ్రుల గద్దింపు

కళాశాలలోనేమో టీచర్స్ పెట్స్ కే గుర్తింపు

భరించలేక ఇంటా బయటా వేధింపు

తన విద్యకు రాదని ఏ రాణింపు

పెట్టింది కళళకు ఫుల్ స్టాప్

పడింది ఆమే కలలకు డ్రాప్

కాలంతో పయనం, వచ్చిందామెకు యవ్వనం

మెట్టింట పెట్టింది పాదం

ఇద్దారు చిన్నారులకిచ్చింది జననం

ఉప్పొంగింది ఆమె మాతృ హృదయం

రాబోతోందని తన కలలు ఫలించే తరుణం

అయితే…??

గానం, నాట్యం అవుట్ ఆఫ్ ఫ్యాషన్

క్రికెట్, టెన్నిస్ నేటి పాషన్

అని చెప్పే చిన్నారుల మాటల్కు వచ్చినా ఎమోషన్

ఎదురు చెప్పలేని నిస్సహాయత తెచ్చిందామెకు డిప్రెషన్

మూసుకున్న గుండె తలుపు తట్టింది ఓ ధ్వని

తలయెత్తి చూచింది లయ తప్పిన హృదివీణ మీటింది ఎవ్వరని

నాక్-అవుట్ మీకోసం అన్నది నవ్వుతూ జెమిని

కొత్త ఊపిరి ఎదనిండగా కాగితం, కలం చేకొని లేచింది ఆ జవ్వని

 

(జెమిని టివి లో, ‘నాక్-అవుట్’ అనే, కార్యక్రమం కోసం రాసిన చిన్న కవిత

Leave a comment