అ ఆ ఇ ఈ లు చదవాలి

ప: అ ఆ ఇ ఈ లు చదవాలి

అందరం ఒకటై నడవాలి

ఇల్లంత మనమే దిద్దాలి

స్త్రీ అంటే సబలని చాటాలి ||

చ: అక్షరమాల నేర్వాలి

ఆనందాల తేలాలి

ఇంటింట దీపం వెలగాలి

ఈ పల్లెలె పట్నాన్ని మించాలి ||

చ: ఉన్నతమైన ఊహలతో

ఊహలకొచ్చిన రెక్కలతో

ఎంతో ఎత్తుకు ఎదగాలి

ఏ పనినైనా సాధించాలి ||

చ: ఐదు, ఆరు, ఏడు అంటూ

ఒకరికి ఒకరు తోడై ఉంటూ

ఓర్పూ నేర్పూ మగువ సొంతమని

అవుననిపిస్తాం ఎవ్వరేమనని ||

అందరాని అందాలాలు ఎక్కేద్దాం

ఆః దేశాన్ని ముందుకు నడిపిద్దాం

మనమే ముందుకు నడిపిద్దాం ||

Leave a comment