ఆలించవే తల్లి నా ఆర్తి

ప: ఆలించవే తల్లి నా ఆర్తి

కీర్తింతునే దుర్గ నీ కీర్తి ||

చ: కన్నుల వెలిగే కరుణాకాంతి

గాంచిన భక్తుల మనసుకు శాంతి

పెదవుల మెరిసే చిరునగవుల దొంతి

పారద్రోలేను మదిలోన భ్రాంతి ||

చ: పార్ధుడు ప్రార్ధించ ఇంద్రకీలాద్రిపై

వెలసితివీవని నీ చరిత వ్యాప్తి

కనకదుర్గమ్మ నీ కరుణామృతమే

కనకధారయని జగమందు ఖ్యాతి ||

Leave a comment