ప: ఈయగా వధువుకు మంగళహారతులు
తరలిరండి త్వరితగతిని ముత్తైదువలు ||
చ: సత్యలోక సరస్వతీ, వైకుంఠ వైష్ణవీ
కైలాస శాంభవీ, అరుదెంచగ పతులతో
నూరేళ్ళు నిండుగా, పసుపు కుంకుమలతో
వర్ధిల్లమనుచు తనను దీవించగా నగవులతో ||
చ: పుత్రపౌత్రాభివృధ్ధి కలుగుననుచు చతుర్ముఖుడు
సిరిసంపదలతూగమనుచు శ్రీవల్లభుడు
అండతానుండుననుచు మృత్యుంజయుడాశివుడు
ముగ్గురు మూర్థులు కలిసి దత్తుడై సద్గురుడై
సౌభాగ్యవతీ అనుచు ఇటకే విచ్చేయగా ||
చ: సప్తర్షులే నిలిచి వేదఘోషచేయగా
ముక్కోటి దేవతలే పుష్పవృష్టికురియగా
అడుగడుగు దండాల వెంకటెశ్వరుడు తానే
పద్మావతినిగూడి పరవశమున తిలకించగ ||