కనికరమేలేద? శ్రీ సాయినాధ

ప: కనికరమేలేద? శ్రీ సాయినాధ

చరణమ్మె శరణంచు నమ్మితి కదా||

నీ చరణమ్మె శరణంచు నమ్మితి కదా||

చ: శిరిడీ గ్రామమే నివాసమైనా

భక్తులబ్రోచెను ఎందున్నా

మసీదులొనే కొలువైవున్నా

అందరి దైవం సాయేనన్న

హెమాడ్పంతు బొధలు విన్నా

మొరవినగ రమ్మనుచు వేడుచున్నా||

చ: భవరోగముల పారద్రోలు ధన్వంతరి

తాత్యాకై వదిలెను ఊపిరి

సమాధినుండె పలికెను మరి మరి

దీనులకై పరువిడు పరి పరి

దాసగను పలికిన స్తవనమంజరి విన్నా

ఆదుకొనగ రమ్మనుచు వేడుచున్నా||

Leave a comment