తగదింక మౌనం, చరణమ్మె శరణం

ప: తగదింక మౌనం, చరణమ్మె శరణం

అనుక్షణం అంటినే, భజే సాయినాధం ||

చ: కుగ్రామమునే చేశావు నగరం

మసీదునే చేశావు మందిరం

ఒక్క మాటతోనే చేసావట వైద్యం

ఒక్క స్పర్శతోనే పోద్రోలావట జాఢ్యం

కరుణకు రూపం మా గురుదైవమని

భక్తులు పలికిన మాటలె నిజమని

చేరితిని సన్నిధానం, చేసితిని నీ ధ్యానం ||

చ: నీ నియమం నిత్యాగ్నిహోత్రం

నీ మౌనం బ్రహ్మప్రబోధం

నీవుకోరే దక్షిణ శ్రధ్ధా సహనం

మా మదిని వెలిగించేది ఆత్మ జ్ఞానం

నీ వాక్కులె మము నడిపించు నిరతమని

నీ ఆచరణలె మోక్షప్రదమని

నమ్మినది నా హృదయం, చేరినది నీ చరణం ||

Leave a comment