పల్లెటూళ్ళె దేశానికి పట్టుకొమ్మలు

ప: పల్లెటూళ్ళె దేశానికి పట్టుకొమ్మలు

మగువలే ఇల్లుదిద్దె మాతృమూర్తులు ||

చ: అ అంటే అమ్మ అని తెలియాలి

ఆనందంగా జీవితాన్ని నడపాలి

ఇంటా బయట గెలవాలి

అందుకె నువు చదవాలి

చదువుంటే తెలివి కలుగు, తెలివుంటే కలిమి కలుగు

పుట్టిన ఇంటికి వెలుగును చూపు

పదిమందికి దారిని చూపు ||

చ: ప్రతి రంగాన ఉన్నతాధికారులమ్మా స్త్రీలు

వారి బాటసాగగా అందించేరు సేవలు

అవి అందుకొని ముందడుగు వేయాలి పడతులు

దేనికైనా తగుదురని చాటాలి ఇంతులు ||

చ: సమస్యల వలయమమ్మ జీవితం

అవి దాటగా కావాలి కొండంత ధైర్యం

ఆ ధైర్యమే ఆయుధం

ఆయుధమంటే అక్షరం

అందుకొని అక్షరం, నవ్వు నవ్వు ప్రతి క్షణం ||

చ: ఇంటి ముందు ముత్యాల ముగ్గులు

గడపకే శొభనిచ్చు తోరణాలు

ఓర్పు, నేర్పు కలబోసిన తరుణులు

భావి భారతానికే వన్నె తెచ్చు వనితలు

భారతాన్ని ప్రగతి వైపు నడుపు నారీమణులు ||

Leave a comment