ప: భారతం భారతం భారతం
జన్మించినందుకే ఇంత గర్వం ||
చ: ఎందరో వీరుల కార్యదీక్ష
తెచ్చింది మనకు ఈ స్వేచ్చ
మనలోనే మనము పెంచుకుంటె కక్ష
లేదు లేదు వార్కి అంతకన్న శిక్ష ||
చ: అహింసో పరమోధర్మ అన్నదే వేదసూక్తి
అది పాఠించి గాంధీజీ అయినాడు మనకు స్ఫూర్తి
దశదిశలా వ్యాపించే అతని కీర్తీ
ఆ జాతిపితకే అంకితము ఈ గీతి ||