ప: మదిలోని కలతలు తొలగించు ఆరతులు
షిరిడీలోని సాయి సంకీర్తనలు ||
చ: కిలకిలరావం వినిపించు ఉదయం
నింగిని భానుడు ఉదయించు సమయం
భూపాల రాగం పాడేటి హృదయం
కాకడ ఆరతే సాయికి సుప్రభాతం ||
చ: భిక్షకై సద్గురుడే ఏతెంచు అపరాహ్ణం
ఆచరించు వైశ్వదేవం, అదే సాయి నైవేద్యం
ఆకశాన తారలు తొంగిచూచు తరుణం
అందరం పలుకుదాం భజే సాయినాధం ||
చ: కన్నతండ్రి సాయేనంటూ ప్రార్ధించు భక్తజనం
రేయైతే సాయికి ఊయల చేసేరు అంతరంగం
అడుగడుగున చేయూత అందించు సాయికరం
చెప్పకనే చెబుతోంది సాయి మనసు నవనీతం ||