రాజరాజేశ్వరి రామసహోదరి

ప: రాజరాజేశ్వరి రామసహోదరి

భక్తవశంకరి శంభుమనోహరి ||

చ: సంగీత సాహిత్య దేవేరి సరస్వతి

ఐశ్వర్యవరప్రద శ్రీ మహలక్ష్మి

సౌభాగ్య వరములనొసగేటి శ్రావణగౌరి

ముగురమ్మలకే మూలపుటమ్మ మా సాయి పరమేశ్వరి ||

ఓం…

చ: ఐంకార హ్రీంకార శ్రీంకార బీజాక్సరి

పతినేన సగమైన అర్ధనారీశ్వరి

పదునాల్గు భువనాల ఎలేటి మహరాణి

అష్టాదశ పీఠనివాసిని మా సాయి త్రిపురసుందరి ||

Leave a comment