వదలకు వదలకు సాయి ధ్యానము

ప: వదలకు వదలకు సాయి ధ్యానము

నరజన్మకదియే ఇహము పరము

చ: దేహమే షిరిడీ హ్రిదయమే ద్వారకమాయి

అంతరంగమందు జ్యొతీయి వెలుగొందె సాయి

సాయి ఓం, శ్రీ సాయి ఓం

ఆ రూపమే కనుపాపల నిండుగా

కనిపించగా మది పులకించగా

తనువులోని అణువణువు ఉప్పొంగి పలికింది గేయమై

సాయి ఆరాధనకై, సాయి ఓం ||

చ: జన్మ ఒక వరం అది కైవల్య సాధనం

కష్తమైన సుఖమైనా చెరుమా జీవన గమ్యం

సాయి ఓం, స్మరియించుమ ప్రతిక్షణం మరువకుమా సాయి పదం

స్మరియించుమ ప్రతిక్షణం అనుసరించు సాయి పదం

పొందుమా మరలిరాని ముక్తి పధం, సాయిసన్నిధానం ||

Leave a comment