ప: సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
సాయిరామా | శ్రీ సాయిరామా
పరంధామా | ఓ పురుషొత్తమా
కరునాలలామ | నీకేనేభారమా ||
చ: ఏ జన్మ పాపమో ఏ దేవి శాపమో
విధివశమేమో నా జీవితం
మనసుకు శాంతి తనువుకు విశ్రాంతి
కదుదూరమాయె మొరవినవాయె ||
చ: తెలివిలేక, బాధ తెలుపలేక
బ్రతుకు భారం అయ్యిందయా
మంచితనమ్మె చులకనాయె
మది మూగబోయె శరణింక నీవె ||
చ: షిరిడీనాధ క్రుపచూపరాదా
మదిలో నిన్నే నమ్మితికదా
తనయులగతి నీవే చుడాలయా
దాసిని దయతో మన్నించవయా
పేద దాసిని దయతో మన్నించవయా ||