ప: ఆర్తినే ఆరతిగా చేసాను సాయి
ఆర్తి బాపి ఆనందాల తేలించ రావొయి
సాయీ ద్వారకామాయీ, ఓ సాయి ||
చ: కన్నులారగాంచగా నీ చల్లని నగుమోము
ఏనాడు నోచినానో ఏ నోము
మనసారగ తలచగ నీ నామము
ఏనాడు చేసినానొ ఏ పుణ్యము ||
చ: నీ రాకతొ మారెనుగా ఇల్లే కోవెలగా
ఈ లోగిలి ఏనాడో చేసుకున్న భాగ్యముగా
బ్రతుకే సాగెనుగా ప్రతిరోజూ పండుగగా
ఇది కరుణతో నీవే మాకిచ్చిన వరముగా ||