దిక్కికనీవే సాయీ నాకిక

ప: దిక్కికనీవే సాయీ నాకిక

దిక్కులుతోచక నిలుచుంటి ఒంటిగ ||

చ: అంతరంగాన ఉన్నది నీవనీ

ఆపదలందు ఆదుకొందువనీ

ఇక్కట్లు బాపే ఇలవేల్పు నీవనీ

పిలిచితి పరుగున రావా మొరవిని ||

చ: అహమును ఖండించి అక్కున జేర్చుకొని

ఆత్మానందమనే అమృతమందితువని

ఇలకు విచ్చేసిన పరంజ్యోతి నీవని

వేడితి వేవేగ రావా దయగని ||

చ: అమ్మాయి అంటూ నను పిలిచింది నీవని

ఆనందాంభుది ఓలలాడితిని

ఇంద్రకీలద్రిపై వెలసిన దుర్గమ్మ నీవని

పరిపరి ప్రార్ధించితి సౌభాగ్యమిమ్మని ||

Leave a comment