ప: మాటవినకుంది నా మది
మొర వినకున్నది నీ హ్రుది
నీవుగాక మరి వేరే ఎవరూ లెరన్నదీ
పిలుపును విని కరుణనుగని తీరం చెర్చాలన్నది
సాయి రాం ఓం సాయి రాం
సాయి రాం శ్రీ సాయి రాం
సాయి రాం జయ సాయి రాం
సాయి రాం గురు సాయి రాం ||
చ: సోకినంత తను పులకరింతునని
ఎదురు జూచును అవని ఆ రవికై
తాకినంత తను పరవశింతునని
తహతహలాడును రవి నీ పదస్పర్శకై
ఈ అవని ఆ రవి నా వ్యధను నీకే
విన్నవింతు మనినా …..||
చ: నీ పదముల కడిగే నదీమతల్లులు
కలిసే కడలి ఎగసెను అలలై ఆ నింగికై
నీ శిరమున నిలిచి ధన్యతనొందగ
తపించెనా నింగి నికై చత్రమై
ఈ కడలి ఆ నింగి నా కధను నీకే
విన్నవింతుమనినా…||