సాయి నీ ధ్యానమెంత హాయి

ప: సాయి సాయి సాయి

నీ ధ్యానమెంత హాయి

నీ నామమెంత మధురమోయి

జీవితమే సఫలమోయి ||

చ: కరుణకురియు కనుదోయి

కాంచినంత భ్రమలుపోయి

గంగపొంగు కన్నులలో ఆనందము నిండునోయి ||

చ: అభయమొసగు కరమోయి

ఆపదలు బాపునోయి

వెన్నవంటి హృదయమోయి

వెన్నెల కురిపించునోయి ||

చ: శుభకరమగు పదమోయి

గంగకు జనస్థలమోయి

పాపములే కడుగునోయి

కైవల్యము స్థిరమోయి ||

Leave a comment