దైవమిచ్చిన వరం

పదుల్లో అమ్మకి నచ్చే కోడలు రావాలనుకున్నా
పదహారులో అందమైన భార్య కావాలనుకున్నా
ఇరవైల్లో అర్ధంచేసుకునే అర్ధాంగి చేయిపట్టాలనుకున్నా

దేవుడు అన్నీ వింటాడు, అన్నీ చేస్తాడు!
ఎక్కడెక్కడి మనుషుల్నో కలిపేస్తాడు!
ఆయన విధానాలు ఒక వింత,
ఆయన లీలలు చక్కని గిలిగింత.

నా ఇంటి దీపం వెలిగించడానికి వచ్చిందో చిన్నది
తన చూపు చాలు, ఇక అందం గురించి చూడనేల?
తన నడక చాలు, ఇక తీరుతెన్నుల గురించి అడగనేల?
తన అల్లరి చాలు, ఇక చిలిపితనం గురించి వెతకనేల?
తన స్పర్శ చాలు, ఇక ఆనందం గురించి చింతేల?
తన సహవాసం చాలు, తనకన్నా జీవితానికి అర్ధమేల?

తలచుకుంటే నవ్వొస్తుంది,
ముప్పైలు దగ్గరపడుతుంటే అనిపిస్తోంది,
నేను భార్యని అడిగితే, దేవుడు,
నాకు అమ్మని, బొమ్మని, కూతురుని కలిపి ఇచ్చాడని!

ఓర్పుకి సత్యభామలా కూతురైతే,
కూర్పుకి సరస్వతిలా తల్లయితే,
ప్రేమకి రాధలా బొమ్మయింది.

అదే నా చిన్నది, నా కన్నుల పంటది.
నన్ను కళ్యాణవల్లభుడిని చేసిన దేవుని వరమది.

2 thoughts on “దైవమిచ్చిన వరం

  1. ఎన్.వి.శివరామకృష్ణ's avatar ఎన్.వి.శివరామకృష్ణ

    జీవిత భాగస్వామ్య ఎన్నికకు
    గణాంకాలు లెఖ్ఖ- జాతకరీత్య,
    గుణాంకాలు- సంసారిక రీత్య,
    గుణగణాల విశిష్టత మన్నికకు
    కుదిరితే జాతకం,లేకపోతే బూటకం!

Leave a comment