చందమామలోన దాగినావటే

ప: చందమామలోన దాగినావటే

అంబ లలితాంబికా కారావటే ||

చ: చిత్కళ నీవటే

చిరునవ్వుల రాణివటే

చిరుచిరు జల్లుల వరములు కురిపించరావటే ||

చ: ఆదిశక్తి నీవటే

ఆదిఅంతు లేదటే

అండపిండ బ్రహ్మాండములన్నిటనీ వుంటివటే ||

చ: క్షమ నీ రూపమటే

క్షర-అక్షర నీవటే

క్షీరాబ్దిని ఉదయించిన కన్యకమణి నీవటే ||

Leave a comment