అందుకొనుము హారతి, అఖండ సౌభాగ్యవతి

ప: అందుకొనుము హారతి, అఖండ సౌభాగ్యవతి

ముత్తైదువలై వచ్చిరి ముగురమ్మలు నీ దరి ||

చ: తిలకించగా నీ పరిణయ వేడుకలు

ఈ ముంగిట నిలిచిరి ముక్కోటి దేవతలు

నీ బ్రతుకున కురిపించగ కరుణామృత జల్లులు (ఆశీస్సుల జల్లులు)

వేచినారు శుభఘడియకై చేకొని అక్షింతలు ||

జననీ దుర్గాభవానీ

ప: జననీ దుర్గాభవానీ

మరచితివా నీ తనయని

కరుణ పాలించు కాత్యాయనీ

మరి మరి నిన్నే వేడితిని శర్వాణీ ||

చ: లేదమ్మా శృతిలయ ఙ్ఞానము

రాదమ్మా రాగాలాపనము

వ్రాయని తోచదమ్మ ఒక్క పదము

మన్నించి నీవే నడిపించు ప్రతిక్షణము

మన్నించి మమ్ము నడిపించు ప్రతిక్షణము ||

చ: గత జన్మయందు పొందిన శాపమో

వెలిఅయితి నమ్మ నిను చూడ ఈ క్షణము

మన్నించి కలనైన ఈవమ్మ అభయము ||

చ: లేవమ్మా ఙ్ఞానము, లౌక్యము

లేనే లేవే కల్లాకపటము

కూడదమ్మా బేలపైన కాఠిన్యము

ఈయవమ్మా మదితెలుపు చాతుర్యము

అలుకమాని చూపవమ్మా జీవితాన మాధుర్యము ||