షిరిడీలో వెలసిన సాయినాధా

ప: షిరిడీలో వెలసిన సాయినాధా

నా గుండెగుడిలో కొలువున్నది నీవుకాదా ||

చ: నా కన్నులలో చిందిన నీరు

గంగాయమున సంగమమై నీ పదసన్నిధి చేరు

నీ కళ్ళనుండి జాలువారు కరుణామృత ధారలు

ఆశీస్సుల జల్లులై నా యెద చేరు ||

చ: నా హృదయంలో పొంగుతున్న వేదన

నిత్యాగ్నిహోత్రునికే నివేదన

నీ గుండెలలో మా పైన వెల్లువైన ప్రేమ

అభయమై నడిపించు మమ్ము గురుదైవమా గురుదైవమా ||

ఎంత చక్కని వాడమ్మా సాయినాధుడు

ప: ఎంత చక్కని వాడమ్మా సాయినాధుడు

ఎంత చల్లని వాడమ్మా సాయిదేవుడు ||

చ: విద్యను ఒసగే గణపతివాడే

సంతతినొసగే సుబ్రహ్మన్యుడే

మహిషుని జంపిన దుర్గ వాడే

కరుణ జూపగ మనకై అవతరించాడే

సాయి సద్గురుడే వాడే ||

చ: దశగ్రీవుని దునిమిన రాముడు వాడే

గీతను తెలిపిన మురలీధరుడే

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడే

కలిదోషము బాపగ అవతరించాడే

సాయి సద్గురుడైనాడే ||