ఏల ఈ శోధన శ్రీ సాయినాధా

ప: ఏల ఈ శోధన శ్రీ సాయినాధా

కరుణించి మమ్ము కావగ జాగేలా ||

చ: నీ అభయం కల్పవృక్షము కన్న అధికమని

తెలిసి నిన్ను కొలిచి మదిని నిలిపె నేనుండగా ||

చ: నీ చరణం పావన గంగాయమునల సంగమమని

తలచి దరిని నిలిచి మేను మరిచి నేనుండగా ||

చ: నీ హృదయం నవనీతముకన్న మృదువని

నమ్మి తన్మయమ్ముగమ్మి కనులనీరుజిమ్మి నేనుండగా ||

మూడు వన్నెలున్నా ఒకటే జెండా

ప: మూడు వన్నెలున్నా ఒకటే జెండా

జాతులెన్ని ఉన్నా మనమొకటేనంటా ||

చ: గాంధీ, నెహ్రూలలోని సౌజన్యం

ఆంధ్రకేసరీ మన టంగుటూరి సాహసం

స్వామి వివేకానందుని ఆత్మ సౌందర్యం

కావాలి విద్యార్ధులకాదర్శం ||

చ: ఎందరో వీరులకు జన్మభూమి

సిధ్ధార్ధుడు బుధ్ధుడైన కర్మభూమి

కులమత బేధం లేని పుణ్యభూమి

బంగారు మన దేశం భరతావని ||