రాగమయి అమృతవల్లి కదలిరావా

ప: రాగమయి అమృతవల్లి కదలిరావా

కరుణామయి కల్పవల్లి కావగలేవా ||

చ: ఈ దీనురాలిపై దయగల్గలేదా

నీ కరుణ మాపై చూపగరాదా

మా మొర నీకు వినపడలేదా

వింటే మము నీవు కరుణించ రావా ||

చ: పువ్వునైన నీ పదముల వ్రాలేను

పండునైన నీకు అర్పితమయ్యేను

దివ్వెనైన నీ ముంగిట వెలిగేను

మనిషినై నీకు దూరమయ్యాను ||

ఎవరికి నేనూ ఏమీ కాను

ప: ఎవరికి నేనూ ఏమీ కాను

ఎటు చూసినా ఒంటరితనము

ఓ సాయిబాబా, నీవైన రావా

మా తోడు నీడై, కాపడలేవా ||

చ: ఎటు చూసినా పెనుచీకటి

కనరాదూ మార్గమేదీ

కరుణించి మాపై చూపాలి జాలి

దయజూచి మాకూ చూపాలి దారి ||

చ: ప్రతిచోటా పొందాను అవమానం

వినపడలేదా నా ఆక్రోశం

నీకైన లేదా మాపైన అభిమానం

నమ్మాము లేవయ్యా మనసార నీ చరణం ||