శ్రీ రాజరాజేశ్వరి, అమ్మా

ప: శ్రీ రాజరాజేశ్వరి, అమ్మా

మమ్మేలు పరమేశ్వరీ ||

చ: తంజావూరులోన బృహదీశ్వరివే

బెజవాడలో కనకదుర్గమ్మవే

కంచిలోన కామాక్షి

మధురలోన మీనాక్షి

కాశి విశాలాక్షివే

శ్రీశైల భ్రమరాంబవే

పలుపేర్లతో నీవు పలుచోట్ల వెలసినా

దీనజనోధ్ధరణకేనని నమ్మినామమ్మా ||

చ: నీదు చరణమ్ములే బాకు శరణమ్మని

నీదు సేవ మనసారగ చేసి తరించాలని

ఆశతో వచ్చాను దిక్కు నీవని

ఆశీస్సులీయవమ్మా దాక్షాయణీ ||

చ: తెలియని బాధల కృంగి కృశించితి

నీవే దిక్కని మదిలో నమ్మితి

గండాల తొలగించు గౌరమ్మ తల్లీ

కడగండ్లపాల్ జేయకే కల్పవల్లి ||

వచ్చింది ఈనాడు పత్రిక

ప: వచ్చింది ఈనాడు పత్రిక

ఇంటింటికది దత్తపుత్రిక ||

చ: ఆడతంటె అబలని అన్నారు ఆనాడు

కాదు కాదు సబలని నిరూపించె ఈనాడు

వసంతమై వచ్చింది వసుంధర

నారి జీవితాన కొత్తవెలుగు నింపగా ||

చ: అహింసే ఆయుధముగ ఆంగ్లేయుల తరిమిగొట్టి

స్వాతంత్ర్య రేఖలనందించె బాపూజీ

స్త్రీ జన సమస్యలన్ని తరిమివేయ నడుముగట్టి

ఉషా కిరణాలనందించె రామోజీ ||

చ: మహిళలకతడే దారిజూపు గురూజీ

బాలబాలికలకతడే మమతపంచు తాతాజీ

ఆంధ్రావనిని నడిపించు సారధి

భావి భారానికతడె కావాలి నేతాజీ ||