దివ్య మంగళ హారతులీరే పడతులారా

ప: దివ్య మంగళ హారతులీరే పడతులారా

విఘ్నముల బాపు విఘ్నేశ్వరునికి మనసారా ||

చ: ముక్కంటినే ఎదిరించి పోరాడిన ఆ ధీరునికి

తల్లికొరకు తొలినాడే తలయిచ్చిన ఆ త్యాగధనునికి ||

చ: గజముఖుడై, ప్రమధగణములకధిపతియై

ప్రధమ పూజ్యుడై, దీనజన పోషకుడై

భువిపై వెలసిన గణనాధునికి, ముదముగ లక్ష్మీగణపతికీ ||

వేళాయెనే గణపతి సేవకు

ప: వేళాయెనే గణపతి సేవకు

పోవలెనే ఆ స్వామి కోవెలకు ||

చ: భక్త జనుల హృదయాల చేసికొనే ఉయ్యాల

శరణుకోరి ఈ వేళ పాడగా జంపాల

చ: తీర్చరాడ తండ్రివోలె మనల ముద్దుమురిపాల

కైమోడ్చి మనసారా పాడగ జోలపాట ||

song audio link 👇https://youtu.be/mqbZ7surw8U?si=2tP8Cun4OhnIHvwa