శ్రీ గణేశ పాహిమాం

ప: శ్రీ గణేశ పాహిమాం

జై గణేస రక్షమాం ||

చ: కనులకు విందైన దివ్యమైన ద్విరూపం

తెలిపేను మానవాళి మదిలోని లోపం

కొలిచిన భక్తులకు కొంగు బంగారం

కరుణకు నిలయమైన నీ చల్లని హృదయం

ఆ లోపాల మన్నించి దీవించు నవనీతం

ఆ లోపాల మన్నించి పాలించు ఆసనం

మా కోర్కెలన్నీ తీర్చేటి కల్పవృక్షం ||

చ: కలనైనా ఇలనైనా కావాలి నీ శరణం

రేయీ పగలూ చేసేమూ నీ ధ్యానమే

కొలిచేమూ అనయమూ నీ చరణమూ

ఇవ్వాలీ పూజమెచ్చి నీ అభయమూ ||

song audio link below 👇

https://youtu.be/GZq9hQiGvZU?si=aALtfh-K3uSTXef5

జేజేలు గణపతి జేజేలయా

ప: జేజేలు గణపతి జేజేలయా

కన్నుల విందుగ కనిపించినావయా

తెచ్చింది నీ రూపు మనసుకు మైమరుపు

వచ్చింది పాటను రాయగా తలపు ||

చ: దివి నుండి భువికి దిగివచ్చినావుగానీ

గుడి నుండి వెలికి రావేలనేవని

ఆక్రోశించే భక్తులకై…

వచ్చావు ఊరేగింపుగా మా దైవమై ||

చ: దారి వెంట భక్తులను కన్నులతోనే పలకరించి

కనికరించి దీనులను కరుణతోడగ దీవించి

వెళ్ళేవు నీవు నిమజ్జనమునకై

వేచేము మేము మళ్ళీ నీ రాకకై

song audio link below 👇

https://youtu.be/SflqIaDpy7Q?si=k1MA8W6o9jQ3Jq4Y