శ్రీ వినాయకుని పూజించవే మనసా

ప: శ్రీ వినాయకుని పూజించవే మనసా

సిరి తనకు తానై దిగి వచ్చునే ||

చ: ధ్యానింప మనసారా శ్రీ లక్ష్మీ గణపతిని

లేములన్నీ బాపి ఇచ్చేనైశ్వర్యముని

ప్రార్ధిచ మనసారా ఆ విజయ గణపతిని

సమకూర్చేను ధరలోన సకల విజయములని||

చ: సేవించ మనసారా ఆ సిధ్ధి గణపతిని

సర్వ కార్యములను దీర్చి కాపాడునీ జగతిని

భజియించ మనసారా ఆ బుధ్ధి గణపతిని

భయములన్నీ బాపీ ఇచ్చేనూ అభయముని ||

చ: కోరిన కోర్కెలు తీర్చే కొండత దైవమై

వెలసెను విఘ్నేశ్వరుడు ఈ భువిపై

శరణని వేడిన అభయముగా

దండము పెట్టిన అండగా

నిలిచేను ఆ కరుణా సాగరుడు

ఎందెందు వెదికిన అందందు కలడు ||

మేలుకోవయ్యా, ఓ బొజ్జ గణపయ్య

ప: మేలుకోవయ్యా, ఓ బొజ్జ గణపయ్య

మమ్మేలుకోవయ్యా, ఇంటింటి రాజువయ్యా ||

చ: కుహు కుహు గానాలతొ కోయిలలు

తకధిమి తకతై నాట్యాలతో నెమళులు

కిలకిలా రావాలతొ పికములూ

ప్రకృతే పరవశించిపోవగా

మేలుకొలుపుచున్నాయి మెల్లగా, మెలమెల్లగా ||

చ: ముగ్గులతో మురిసిపోవు ముంగిళ్ళు

పసుపు కుంకుమలతొ అలరారు లోగిళ్ళు

ప్రతి గడపకు శోభనిచ్చు తోరణాలు, మామిడి తోరణాలు

వేచివున్నామని నీ రాకకై

వేగిరపడుతున్నవి నీ పాదధూళికై ||