నేనే చెప్పాను, నేనప్పుడే చెప్పాను

పనిలో ఉన్న సరదాకన్నా, మనతో పనిచేసేవారితో ఉన్న సరదా ఎక్కువ.

నా మొదటి ఉద్యోగం లో, అంటే నేను సత్యం కంప్యూటర్స్ లో పనిచేసెటప్పుడు, ఉచిత సలహాలు ఎన్నో విన్నాను. వాటిలో ఎన్ని నేను తీసుకున్నాను, ఎన్ని నాకు మంచి చేసాయి అనేవి పక్కన పెట్టండి. విషయమేంటంటే, నేను సలహాలు విననప్పుడు మాత్రం “నేనప్పుడే చెప్పాను” అనే దెప్పుడు మాత్రం నాకు తప్పేదికాదు. మొదట్లో సీనియర్ల సలహాలు వినటం మంచిదేమో అనే అనిపించింది. కానీ, వారు ప్రతి సలహాకి “నేను చెప్పాను కానీ, నువ్వే నిర్ణయం తీసుకో” అని కలిపి చెప్పటం వల్ల, నేను ఎప్పుడూ అదోరకమైన సంధిగ్ధావస్థలో ఉండిపొయాను. Continue reading “నేనే చెప్పాను, నేనప్పుడే చెప్పాను”

దురధ్రుష్టం నవ్వింది, బాలక్రిష్ణలా పలకరించింది

అమ్మ, నాన్న వచ్చిన ఆనందం. వాళ్ళు ఏది అడిగినా చెయ్యలనే చిన్న తపన.

అమ్మకి దేవుడంటే భక్తి. నాన్నకి అమ్మంటే ప్రేమ.

టి.వి.లో రివ్యూ చూసి, నయనతారకి పూజలుచేస్తున్నారని విని, బాలక్రిష్న తన తండ్రిని తలపించాడని పేపర్లో చదివి, పిల్లలు మహాద్భుతంగా భావాలు పలికించారని కొందరు నేస్తాలు చెప్పగా; మనసులో కలవరాన్ని పక్కన పెట్టీ, నాలుగు తిక్కెట్లు కొని, అమ్మ, నాన్న, నా అర్ధాంగి, నేనూ, జగదాంబలో ఆడుతున్న “శ్రీ రామరాజ్యం”కి వెళ్ళాం.

వెళ్ళిన తర్వాత దురద్రుష్టం మమ్మల్ని చూసి నవ్వింది, తన అద్రుష్టానికి పులకరించిది,  బాలక్రిష్ణ రూపంలో పలకరించింది. Continue reading “దురధ్రుష్టం నవ్వింది, బాలక్రిష్ణలా పలకరించింది”