ప: చిన్ని చిన్ని పిల్లలం, కలిసి మెలిసి ఉంటాం
చిలిపి చిలిపి అల్లరే చేస్తాం ||
చ: ఆటలెన్నొ ఆడుతాం, పాటలెన్నొ పాడుతాం
భరతమాతకే ముద్దు బిడ్డలం
మేము భరతమాతకే ముద్దు బిడ్డలం ||
చ: చదువులెన్నొ చదువుతాం
ఎంతో ఎత్తు ఎదుగుతాం
భరతమాతకే జయం పలుకుతాం
మేము భరతమాతకే జయం పలుకుతాం ||
చ: అమ్మ కంటి దివ్వెలం
నవ్వు పంచు గువ్వలం
భరతజాతికే కాంతి కిరణాలం
మేము భరతజాతికే కాంతి కిరణాలం ||
చ: అందం ఆనందం
ఎటు చూసిన పచ్చదనం
భరతమాతకే మేము చేసేము వందనం ||