ప: బంగారు తల్లి నీవమ్మా, మా అమ్మ దుర్గ రావమ్మా
జగమేలు తల్లి నీవమ్మా, శయనించి సేద తీరమ్మా ||
చ: ఉదరాన దాచింది బ్రహ్మాండమే, పాలించి పోషించు ఆ హృదయమే
నీదు చరణమ్ములే పాపహరణమ్ములే, నీదు అభయంబే మాకు శరణమ్ములే ||
చ: ఏటికేడాదిగా ఎవో పూజలు, భక్తులు చేసేరు మనసారా సేవలు
అర్చనలు మెచ్చి ఇచ్చేవు వరములు, అలసిసొలసిన తల్లివికివే వందనములు ||