ప: కరుణ పాలించు మా కనకదుర్గ
నీవె తీర్చాలి ఈ క్షనమె నా బెంగ ||
చ: నీ ఒడిని పుట్టాను
దయతోటీ పెరిగాను
సేవలెన్నో చేశాను
వరములనెన్నో పొందాను
నేడేల ఈ భయము
ఈవేల నీ అభయము ||
చ: నీ పూజ, నీ సేవ భాగ్యమీదె యిచ్చావు
కరుణ మమ్ముపాలించి కనకదుర్గవనిపించావు
నేడేల ఈ శోధన
ఈవేల నీ దీవెన ||