కామేశురాణి కళ్యాణి

ప: కామేశురాణి కళ్యాణి

చింతల దీర్చవే శర్వాణి ||

చ: బవబంధముల త్రెంచగలేని

సంసార జలధి దాటగలేని

జీవిని గనవే ఓ జననీ

చేయూతనిచ్చి బ్రోవవదేమి ||

చ: అజ్ఞాన తిమిరాన్ని హరియించలేని

ఆత్మజ్యోతిని గాంచగలేని

దాసిని గనవే ఓ జననీ

కైవల్యపధమిచ్చి కావగదేమి ||

లోకకంటకుడైన మహిషుని మర్ధించిన తదుపరి

ప: లోకకంటకుడైన మహిషుని మర్ధించిన తదుపరి

తల్లీ నిను గాంచిన నా మది పలికింద గీతిది ||

అలసిన ఆ కనుదోయి, చెదరని ఆ చిరునగుమోము

గనినంతనె తల్లీ, కలిగెనె నీపై భక్తి ||

చ: ఎర్రని ఆ చీరలో, నుదుట వెలిగే సింధూరములో

పచ్చగ మెరిసే ఆ మోములో, ఆ పద ఝణ ఝణ నాదములో

కాలి మసి అయిందాడే ఆ మహిషుడు ||

చ: తెల్లని ఆ చీరలో, కన్నుల వెలిగే కరుణలో

పెదవుల మెరిసే నగవులో, కాలి అందియల ఝలఝలలో

కరిగి లీనమైనాడే ఈ జీవుడు ||