శ్రీ రామా, జయరామా

ప: శ్రీ రామా, జయరామా

ఫవననామా, పట్టాభిరామా

రాజా రామా ||

చ: అయోధ్యరామా, అనంతనామా

అహల్యశాప విమోచన రామా

అంజనీ తనయ రక్షక రామా

అగణిత గుణశీల దశరధరామా

అమృత హృదయ శ్రీ రామా ||

చ: ఆనందరామా ఆర్జితనామా

ఆర్తిభంజన రఘురామా

ఆశ్రిత రక్షక శ్రీరామా

ఆపదోద్ధార జానకిరామా ||

చల్లని తులసి

ప: చల్లని తులసి

ఇంటింట వెలసి

పూజలందుకుని నీవు మురిసి

దీవెనలిచ్చేవు ఓ తల్లి తులసి ||

చ: మా ఇంటి పెరటిలో వెలిశేవే

మమ్ముల చూశేవే

కరుణతో జూచుచున్నావే

ఆదిలక్ష్మివి నీవేలే

వరములనెన్నో ఇచ్చేవే ||

చ: పిలిచిన పలికే దేవతవే

తప్పుల మన్నించి మము బ్రోవవే

నిత్య కళ్యాణి నువ్వేలే

తులసి లక్ష్మి మమ్మేలవే ||