వచ్చింది ఆమని, అడిగింది ఎవ్వరని

ప: వచ్చింది ఆమని

అడిగింది ఎవ్వరని

ఏమని చెప్పనే ఓ కోయిలా

నేనెవరని చెప్పనే ఓ కోయిలా ||

చ: ఏడాదిగి ఒకసారి వచ్చేది తానని

తనకొరకై పూచేటి మల్లిక నేనని

నీవైనా చెప్పవే ఓ కోయిలా

ఈ చెలికై రమ్మని చిరుగాలిలా ||

చ: తన రాకతొ పులకంచి పరవసించు ప్రకృతికి

శోభనేచేకుర్చే నెచ్చెలి నేనని

నీవైనా చెప్పవే ఓ కోయిలా

తన రాకతో ఊగేనని నా మది ఊయలా ||

చ: పరిమళాళ సుగంధాలు వెదజల్లే రాణినని

తను వెడితే తాళళేక వాడి రాలేనని

నీవైనా చెప్పవే ఓ కోయిలా

తను వెడితే మల్లిక మిగిలేనని మోడులా ||

అనుకుంటే ప్రయాణం, కలుగుతోంది భయం భయం

అనుకుంటే ప్రయాణం, కలుగుతోంది భయం భయం
లేనేలేదు వారికి అభిమానం, వారి వద్దనుండే ఆహ్వానం

వెళ్ళకుంటె ఊరుకోదు సమాజం
వెడితే పొందాల్సివస్తుందేమో అవమానం

అనుకుంటే ద్రవిస్తుంది హృదయం
ఎవరికి అర్ధమౌను నా ఆక్రోశం

తలచిన ఆగలేదు దుఃఖం
జాలువారే కన్నుల కన్నీటి కెరటం

బాధలోన తెలియలేదు ఆ అడుగుల శబ్దం
తుడిచింది నా కన్నీటిని ఒక చల్లని హస్తం

తన హృదిలో చోటిచ్చి ఇచ్చింది తన అభయం
నా కన్నుల నుండి రాలింది ఓ ఆనందభాష్పం