వచ్చింది ఈనాడు పత్రిక

ప: వచ్చింది ఈనాడు పత్రిక

ఇంటింటికది దత్తపుత్రిక ||

చ: ఆడతంటె అబలని అన్నారు ఆనాడు

కాదు కాదు సబలని నిరూపించె ఈనాడు

వసంతమై వచ్చింది వసుంధర

నారి జీవితాన కొత్తవెలుగు నింపగా ||

చ: అహింసే ఆయుధముగ ఆంగ్లేయుల తరిమిగొట్టి

స్వాతంత్ర్య రేఖలనందించె బాపూజీ

స్త్రీ జన సమస్యలన్ని తరిమివేయ నడుముగట్టి

ఉషా కిరణాలనందించె రామోజీ ||

చ: మహిళలకతడే దారిజూపు గురూజీ

బాలబాలికలకతడే మమతపంచు తాతాజీ

ఆంధ్రావనిని నడిపించు సారధి

భావి భారానికతడె కావాలి నేతాజీ ||

ఏ తోటదో ఈ చిన్నారి పువ్వు

ప: ఏ తోటదో ఈ చిన్నారి పువ్వు

తీయనీ పరిమళాలు మనపైకి వెదజల్లు ||

చ: చరణాల, దేవి చరణాల ఒదగాలనొకసారి

సిగలోన, దేవి సిగలోన నిలవాలనొకసారి

మాలికగా, పుష్పమాలికగా దేవికమరాలనొకసారి

కోరేను వరముగా పుష్పమ్ము ప్రతిసారి ||

చ: జడలోన, నాతి జడలోన నలిగేను ఒకసారి

పాదాల, మనుజుల పాదాల మలిగేను ఒకసారి

సుడిగాలికీ రాలేను ఒకసారి

వడగాద్పుకీ వడిలేను ఒకసారి

అయ్యో…

పూజాసుమమై పులకించిపోవాలని

వేడిన పుష్పానికి

విలాపమేనా ప్రతిసారి ||