దివ్యమంగళ హారతులీరే పడతులారా

ప: దివ్యమంగళ హారతులీరే పడతులారా

విఘ్నములబాపు విఘ్నేశ్వరునికి మనసారా, మనసారా ||

చ: ముక్కంటినే ఎదిరించి పోరాడిన ధీరునికి

తల్లికొరకు తొలినాడే తలఇచ్చిన ఆ త్యాగధనునికి ||

చ: గజముఖుడై, ప్రమధగణముల కధిపతి అయి

ప్రధమ పూజ్యుడై, దీనజన పోషకుడై

భువిపై వెలసిన గణనాధునికి,

ముదముగ లక్ష్మీ గణపతికి ||

Song audio link 👇https://youtu.be/gPaVByQNJrI?si=sQl0nRCFU5XVnO8O

ఎందైన నెపుడైన నెవరికైననూ రక్షకుడు గణనాధుడే

ప: ఎందైన నెపుడైన నెవరికైననూ రక్షకుడు గణనాధుడే

ఆర్తజన రక్షకుడు, దుష్టజన సిక్షకుడు విఘ్ననాధుడే ||

చ: మదినమ్మితే ఆ అనాధ రక్షకుని

కరుణించి కాపాడునీ జగతిని

ప్రార్ధించితే ఆ ఆపద్బాంధవుని

త్వరితగతి నిచ్చునే తన దీవెనని

తీర్చునే మన కోర్కెలని ||

చ: భజియించితే ఆ ఉమాసుతుని

భయములన్నీ బాపి కాపాడు తన భక్తులని

స్మరియించితే ఆ ఉచ్చిష్ట గణపతిని

సేవ మెచ్చి ఇచ్చేనూ తన అభయముని, దీవెనని ||

song Audio link 👇

https://youtu.be/8cAKX6u6iYg?si=jA3zSs6weEaXzel3