ప: వేళాయెనే గణపతి సేవకు
పోవలెనే ఆ స్వామి కోవెలకు ||
చ: భక్త జనుల హృదయాల చేసికొనే ఉయ్యాల
శరణుకోరి ఈ వేళ పాడగా జంపాల
చ: తీర్చరాడ తండ్రివోలె మనల ముద్దుమురిపాల
కైమోడ్చి మనసారా పాడగ జోలపాట ||
ప: వేళాయెనే గణపతి సేవకు
పోవలెనే ఆ స్వామి కోవెలకు ||
చ: భక్త జనుల హృదయాల చేసికొనే ఉయ్యాల
శరణుకోరి ఈ వేళ పాడగా జంపాల
చ: తీర్చరాడ తండ్రివోలె మనల ముద్దుమురిపాల
కైమోడ్చి మనసారా పాడగ జోలపాట ||
ప: ఏమని పాడను ఈ వేళ
కన్నుల నీరు పొంగే వేళ
శ్రీలక్ష్మీ గణపతి స్వామి లీల
మది మూగబొయెను ఈ వేళ ||
చ: వచ్చింది వచ్చిందది భాద్రపద మాసము
తెచ్చింది తెచ్చిందది మనసుకు ఉల్లాసము
చెప్పితిమి ముదముగా గణపతికావాహము
చేసితిమి భక్తిమీర ఆ స్వామికి భజనము ||
చ: జరిపితిమి వేదుకగా నవరాత్రి ఉత్సవం
కదిలింది త్వరితగతిని కరుణలేని కాలం
ఏ రీతిని చెప్పగలం స్వామికి ఉద్వాసనం
కరుణగల తండ్రికి మన హృదయమే సింహాసనం ||
చ: కాదమ్మా కాదనీ శాశ్వతమీ దేహం
ఆత్మ ఒక్కటేననీ నిత్యము సత్యము
తెలుపుటకే నిమజ్జనం, కోరి స్వామి పయనం
ఆ త్యాగధనుని తలచినంత జీవితమే ధన్యం ||
song audio link 👇https://youtu.be/KzgLbxfRwQ0?si=b9Og_4hw6CBXGeiF