ప: ఊగవయ్య ఉయ్యాల లక్ష్మీ గణపతి
నీవేనయ్యా విఘ్నాలకు ఒకే ఒక్క అధిపతి ||
చ: అవ్యయాయ గణపతి, అభయదాత గణపతి
ఆధారాయ గణపతి, ఆనంద గణపతి
ఇంద్రశ్రీప్రదాయ గణపతి, ఈశతనయ గణపతి
మా ఈశుబాప ఈ విధి, మా మది ||
చ: ఉత్తమాయ గణపతి, ఉన్నతాయ గణపతి
ఊర్జస్వంతే గణపతి, ఊర్జితనామ గణపతి
రుణత్రయ విమోచనాయ గణపతి, ఏకదంత గణపతి
ఏకంచేయ జగతిని, ఏకదంత గణపతి ||
చ: ఐశ్వర్యనిధయ గణపతి, ఐశ్వర్య గణపతి
ఓజస్వతే గణపతి, ఓంకార గణపతి
ఔదార్యనిధయే శ్రి గణపతి
అనంత శుభదాయ శ్రి గణపతి ||
Song audio link 👇