ఓ బొజ్జ గణపయ్యా, నీ బంటు నేనయ్యా

ప: ఓ బొజ్జ గణపయ్యా, నీ బంటు నేనయ్యా

దయజూపి మమ్మేలూ, ఓ భక్తవరదయ్యా ||

చ: పదునాల్గు భువనాల ఉదరాన దాచి

కరుణించి పాలించు దైవమే నీవయ్యా

ఆరు శత్రుల చిక్కి అజ్ఞానమే తలకెక్కి

నిన్నే మరచిన మనిషి నేనయ్యా ||

చ: దేవతల మానవుల హింసించ వెలిసే

అనింద్యుడను రాక్షసుండు

వామ దంతమును పెరికి, వాని అహమును నరికి

చేసికొంటివి నీకు వాహనంబు||

song audio link 👇

https://youtu.be/5AsKG1mzRYM?si=0zhbVGWPTU-nT25a

శ్రీ గణేశ పాహిమాం

ప: శ్రీ గణేశ పాహిమాం

జై గణేస రక్షమాం ||

చ: కనులకు విందైన దివ్యమైన ద్విరూపం

తెలిపేను మానవాళి మదిలోని లోపం

కొలిచిన భక్తులకు కొంగు బంగారం

కరుణకు నిలయమైన నీ చల్లని హృదయం

ఆ లోపాల మన్నించి దీవించు నవనీతం

ఆ లోపాల మన్నించి పాలించు ఆసనం

మా కోర్కెలన్నీ తీర్చేటి కల్పవృక్షం ||

చ: కలనైనా ఇలనైనా కావాలి నీ శరణం

రేయీ పగలూ చేసేమూ నీ ధ్యానమే

కొలిచేమూ అనయమూ నీ చరణమూ

ఇవ్వాలీ పూజమెచ్చి నీ అభయమూ ||

song audio link below 👇

https://youtu.be/GZq9hQiGvZU?si=aALtfh-K3uSTXef5