ప: నినువినా వేరు దిక్కెవరయ్యా మాకు
కరుణించి కాపాడు కడవరకూ ||
చ: నీ కృపయేనయ్యా మా ఈ జన్మము
నిను ధ్యానించితే బ్రతుకే ధన్యము
కోరనయా నిను ఏ అన్యమూ
నిను స్మరియించని జీవితమే వ్యర్ధము ||
చ: బాలులకీవే విద్యాబుద్ధుల నొసగేటి దైవము
ఏ పూజకైనా నీదేనయ్యా అగ్రతాంబూలము
ఆదుకో అన్నా అని ఆక్రోశించిన
అందించేవు నీ అభయ హస్తము
చేదుకో అయ్యా అని చేతులెత్తి మ్రొక్కిన
చేవోడు నీవై ఇచ్చేవు కైవల్యము ||